చిన్న మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించాలని సీఎం జగన్ ఈ – ఆటోలు ప్రారంభించారని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. గురువారం ఉదయం క్లాప్ కార్యక్రమంలో భాగంగా ఈ – ఆటోలను మంత్రి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ది వికేంద్రీరకణలో భాగంగా సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
36 మున్సిపాలిటీలకు రూ.21.18 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటీ రూ. 4.10 లక్షల విలువ చేసే 500 కేజీల సామర్థ్యం గల 516 ఈ- ఆటోలను పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో మరిన్ని ఈ – ఆటోలు పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇప్పటికే 123 మున్సిపాలిటీలోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో 120 లక్షల చెత్తబుట్టలను పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో చెత్త రహిత రాష్ట్రం సహకారం అవుతుందన్నారు.