గంటా శ్రీనివాస రావు వైకాపాలో చేరుతున్నారని గత కొంతకాలంగా బలంగా వినిపిస్తోన్న మాట. గంటా అన్నీ సర్దేసుకున్నారని.. ఇంక ప్రయాణం మొదలుపెట్టడమే ఆలస్యం అని కథనాలొచ్చాయి. అయితే ఈ విషయంలో వైకాపాలోకి గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకుస్తున్నారు విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్. ఈ సమయంలో సైకిల్ స్కాం ని సాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ “వైకాపాలోకి గంటా” అనే కథనాలు ఆగలేదు. అయితే… తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో “వైకాపాలోకి గంటా” ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఎక్కడ అధికారం ఉంటే అక్కడే గంటా ఉంటారని ఒక కామెంట్. అది పూర్తిగా సత్యం అనేది విశ్లేషకుల మాట కూడా! అలాంటి గంటా శ్రీనివాస్ ను వైకాపాలోకి ఆహ్వానించడానికి కొందరు ప్రయత్నాలు షురూ చేసినా… అవంతి శ్రీనివాస్ మాత్రం మొదటినుంచి నూటికి నూరుశాతం వద్దనే చెబుతున్నారు. తన అయిష్టతని బహిరంగంగానే తెలియజేస్తున్నారు. అయితే… తాజాగా వికలాంగుల భూమి మీద గంటా శ్రీనివాసరావు & కో కన్ను పడిందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో గంటా ఇప్పట్లో వైకాపాలోకి వెళ్లే అవకాశాలు లేవని.. దాదాపు మూసుకుపోయాయని అంటున్నారు!
పూర్తి వివరాళ్లోకివెళ్తే… రాజధానిగా మారబోతోన్న విశాఖ సిటీలో హాట్ ప్లేస్ అయిన మధురవాడలో 1991లో నాటి ప్రభుత్వం వికలాంగుల కోసం పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చింది. అయితే.. ఆ పట్టాలో వారు ఇళ్ళు కట్టుకోలేకపోవడంతో అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో… గంటా శ్రీనివాసరావు అనుచరులు ఆయన మంత్రిగా ఉన్నపుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూములు రాయించుకున్నారట. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో ఏకంగా గంటా శ్రీనివాసరావు మేనల్లుడు విజయ్ కీలకంగా ఉండటంతో… గంటాకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కాగా… గంటా మేనల్లుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు!!
ఇక్కడ మరో విషయం ఏమిటంటే… అవంతి శ్రీనివాస్ మాస్టర్ స్కెచ్ గీసి మరీ “గంటా గ్యాంగ్” ని పట్టించారని అంటున్నారు.