టీవీ కూడా లేదంటున్నావ్‌..సాక్షి టీవీ ఎవరిది ? – జగన్‌ పై అయ్యన్న ఫైర్‌

-

టీవీ కూడా లేదంటున్నావ్‌..సాక్షి టీవీ ఎవరిది ? అని జగన్‌ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్‌ అయ్యారు. అరకు లోయలో చంద్రబాబు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఈ సందర్భంగా మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ….అమ్మని, చెల్లిని చూడని వాడివి.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని మహిళలకు ఎలా భరోసానిస్తావని నిలదీశారు.

మీ బిడ్డను మీరే కాపాడాలి అంటున్నావ్, మమ్మల్ని దోపిడీ చేస్తున్నందుకు నిన్ను కాపాడాలా అని ఆగ్రహించారు. నా మీద 14 కేసులు పెట్టావ్ ఏం పీకావ్… సుప్రీంకోర్టులో కేస్ తేలకుండా సెప్టెంబర్ నుంచి ఎలా విశాఖలో పరిపాలన మొదలు పెడతావని ప్రశ్నించారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. స్టీల్ ప్లాంట్, పోర్టులు అన్నీ ఆదానికి కట్టబెడుతున్నావ్…ఆదాని నీ బంధువా అని నిలదీశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.

Read more RELATED
Recommended to you

Latest news