వైసీపీ ఆఫీస్ ముందు ఉరేసుకుంటా .. టీడీపీ నేత సంచలన కామెంట్స్ !

ఏపీలో గీతం యూనివర్సిటీ కూల్చివేత రాజకీయ దుమారాన్ని రేపుతోంది. 18 కేసులు ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మా ఖర్మ టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. ఈ ఈరోజు గీతం కాలేజ్ అక్రమ కట్టడాలకి సంబంధించి మాట్లాడిన ఆయన జగన్ కు మొదటి నుండి నేర స్వభావం ఉందని అన్నారు. గాంధీ పేరు పెట్టిన గీతం వర్సిటీని కూల్చడం దౌర్భాగ్యం అని అయన అన్నారు.

గీతం ఆసుపత్రి కోవిడ్ సమయంలో విశేష సేవలు అందించిందని స్టేట్ లొనే నెంబర్ వన్ కోవిడ్ ఆసుపత్రికి గా గీతం కు పేరు వచ్చింది కాదని చేప్పండి వైసీపీ ఆఫీస్ ముందు ఉరేసుకుంటానని అయన సవాల్ చేశారు. ఎంతో మంది మేధావులు ఇక్కడికి వచ్చి కాన్ఫిరెన్స్ నిర్వహించారన్న అయన మూల నక్షత్రం ముగిసిన తరువాత దుర్గమ్మ దగ్గరకు జగన్ వెళ్ళాడని, అందుకే కొండ రాళ్ళు విరిగిపడ్డాయని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆక్రమకట్టడాలు కడుతున్నారన్న ఆయన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.