రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి కాదు…నువ్వు విష సాయి అంటూ ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా… రెండు రోజులు ఊపేసి పోయింది… దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి అని మండిపడ్డారు.
అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయమని హెచ్చరించారు. కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేమని… విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నావు…ఇది ప్రపంచానికి తెలుసు అని ఆగ్రహించారు.
పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టమన్నారు. పచ్చని కాపురం లో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు అది నీకు మంచిది కాదు…టిడిపి కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారిని టికెట్ ఇచ్చారన్నారు. జగన్ గారు …ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని కోరారు బండ్ల గణేష్. నాకు కుల పిచ్చి లేదు.. నా కులాన్ని నేను ప్రేమిస్తాను.. ప్రతి కులాన్ని గౌరవిస్తానన్నారు.
జగన్ గారు …ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు
నాకు కుల పిచ్చి లేదు
నా కులాన్ని నేను ప్రేమిస్తాను
ప్రతి కులాన్ని గౌరవిస్తాను @VSReddy_MP— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022