Big Boss OTT Telugu: హమీద స్మార్ట్ గేమ్..డేంజర్ జోన్‌లో ఆ మేల్ కంటెస్టెంట్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ప్రస్తుతం ఓటీటీ 24 బై 7 గా సాగుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ గేమ్..లో ప్రజెంట్ 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే గేమ్ రోజురోజుకూ బాగా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. తమకు ‘బిగ్ బాస్’ ఇచ్చిన టాస్కును పూర్తి చేసేందుకు వారు గేమ్ పై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.

మొన్నటి వరకు హమీద గేమ్ లో కొంత వెనకబడి ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. కాగా, ఇప్పుడు ‘బిగ్ బాస్’ గేమ్ లో స్మార్ట్ గా ఆడుతున్నదనే టాక్ వస్తోంది. స్ట్రాటజీ ప్రకారంగానే హమీద ముందుకు వెళ్తున్నట్లు కనబడుతోంది.

అషురెడ్డి, అరియానాల విషయమై హమీద వ్యవహరిస్తున్న తీరు ద్వారా ఈ విషయం స్పష్టమవుతున్నదని బీబీ లవర్స్ అంటున్నారు. వరస్ట్ కంటెస్టెంట్ పైన స్టాంప్ వేయాల్సి వచ్చినపుడు హమీద అషురెడ్డికి స్టాంపు వేసింది.

ఈ ఏడోవారంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా గతంలో కంటే చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమ పర్ఫార్మెన్స్ ను క్యాల్కులేట్ చేసుకుంటున్నట్లు కనబడుతున్నారు. అయితే, ఈ సారి నామినేషన్ టార్గెట్ లో అనిల్ ఉన్నాడనే వార్తలొస్తున్నాయి. ఈ సారి కంపల్సరీగా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉంటే కనుక అది కంపల్సరీగా అనిలే అవుతాడనే ప్రచారం ఉంది. చూడాలి మరి..ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news