బీజేపీతో టచ్ లో ఉన్నాననేది అవాస్తవం : మల్లాది విష్ణు

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండటంతో రేపటి నుంచి ప్రచారం జోరుగా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అధికారిక వైసీపీ సిద్ధం సభలు నిర్వహిస్తే.. ప్రతిపక్ష టీడీపీ రా.. కదలిరా అంటూ పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నారు. కొందరూ టికెట్ దక్కని వారు పార్టీలు మారుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీజేపీలోకి వెళ్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తాను బీజేపీతో టచ్ లో ఉన్నాననేది అవాస్తవం. నేను అసంతప్తిగా లేను. సంతృప్తిగానే ఉన్నాను. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారవంలోకి రావడం ఖాయం అని జోస్యం చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి వైసీపీలో కొనసాగుతున్నాను. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశాను. సీటు రాలేదని..అసంతప్తిగా లేను.   పార్టీ నిర్ణయం మేరకు పని చేస్తానని తెలిపారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా అద్భుతంగా పని చేసినట్టు  తెలిపారు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news