L&T కంపెనీ చేతిలోకి భోగాపురం ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ వెళ్లింది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టును జిఎంఆర్ గ్రూప్…. ఎల్ అండ్ టి గ్రూప్ కంపెనీ ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ కు అప్పగించింది. ఈపీసీ పద్ధతిలో ఎల్ అండ్ టి కన్స్ట్రక్షన్ ఈ విమానాశ్రయం నిర్మాణ పనులు పూర్తిచేస్తుంది.
అయితే ఈ కాంట్రాక్టు విలువ ఎంత అనే విషయాన్ని రెండు కంపెనీలు వెల్లడించలేదు. ఎల్ అండ్ టీ మాత్రం ఇది పెద్ద కాంట్రాక్ట్ అని పేర్కొంది. దీన్ని బట్టి కాంట్రాక్టు విలువ రూ.2,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాధించేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. తరువాత దీన్ని 1.20 లక్షల ప్రయాణికులకు విస్తరిస్తారు.