టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డి పై దాడి కేసులో మాజీ మంత్రి భూమ అఖిల ప్రియకు కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాలకు చేరుకున్న సమయంలో మే 16వ తేదీన భూమా అఖిల ప్రియ వర్గీయులు ఏవి సుబ్బారెడ్డి పై దాడి చేశారు. ఈ దాడిలో సుబ్బారెడ్డి గాయపడ్డారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా అఖిలప్రియను 17న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది.
అయితే ఆళ్లగడ్డలో లోకేష్ పాదయాత్ర ముగిసి కడప జిల్లాలో అడుగుపెట్టిన తర్వాతి రోజే ఆమెకు బెయిల్ లభించింది. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ ను విచారించిన కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అఖిలప్రియను కష్టడీకి ఇవ్వాలటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.