హైటెక్ ఐడియా: డ్రైవింగ్ రాకపోయినా కారు దొంగతనం.. !

-

నిన్న అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన ఒకింత ఆశ్చర్యాన్ని కల్గించక మానదు. పూర్తి వివరాల్లోకి వెళితే కానాపూర్ లో జరిగిన ఒక విచిత్ర దొంగతనం వైరల్ గా మారింది. ఎలాగైనా తొందరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న ముగ్గురు యువకులు ఆగి ఉన్న కారును దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ ముగ్గురికి కార్ డ్రైవింగ్ రాకపోవడంతో… దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకున్న ఆ ముగ్గురు ఆ కారును మెల్లగా తోసుకుంటూ, అలా దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు వెళ్లారు. ఇక కుదరదు అనుకుని అలసిపోయిన ఆ ముగ్గురు యువకులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. చివరికి కారు నెంబర్ ప్లేట్ ను తొలగించి అక్కడే వదిలేసి వెళ్లారు.

ఈ విషయం గమనించిన పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో వారిని పట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన వారంతా ఇదేమి దొంగతనం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఏమో చాల హైటెక్ ఐడియా తో వచ్చినా సిక్స్ కాలేకపోయారు అంటూ జోకులు వేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news