వాతావరణ శాఖ హెచ్చరిక: ఆ జిల్లాలో భారీ వర్షాలు… !

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల వలన ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యన చూసుకుంటే చేతికి రావాల్సిన పంట కాస్త వర్షపు నీటిలో మునిగిపోవడంతో కన్నీరే రైతుకు మిగిలింది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలో తేలికపాటి వరుసలు మరియు కొన్ని జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని హైద్రాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ రోజు మరియు రేపు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, నగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.