తిరుమల లడ్డు విషయంలో రాజకీయ కుట్రతో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు మాట్లాడాడు. ప్రత్యర్థి పార్టీనీ దెబ్బ తీయడానికి ఎకంగా స్వామీవారి వాడుకున్నాడు అని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించిన తరువాత మరింతగా అబద్దాలు చెప్పడం మొదలెట్టారు. మద్యాహ్నం నుండి టీటీడీ ప్రతిష్ఠ దేశం మొత్తం దిగజారేలా ఒక ఫేక్ రిపొర్ట్ ను రిలీజ్ చేశారు. ఫేక్ రిపొర్టుతో అసత్య ప్రచారాన్ని చేశారు అని అన్నారు.
జూలై 17 తేదిన శ్యాంపుల్ పంపిస్తే.. మీరు నియమించిన ఈవో చాలా క్లారటీగా అలాంటిది ఏం లేదని చెప్పారు. లడ్డులో అవకతవకలు ఉంటె ఈవో ఆరోజు ఎందుకు మాట్లాడాలేదు. మీరు ఎందుకు నిన్న మాట్లాడారు అని ప్రశ్నించారు. ఈ కుట్రపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి. చంద్రబాబు వెంటనే ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలీ. ఇంతటి పాపాన్ని చేసినా చంద్రబాబు వెంకటేశ్వర స్వామీ శిక్ష వేస్తాడు. కేవలం జగన్ పై బురద చల్లడానికే ఇలాంటి నీచమైన చర్యలు చేశాడు చంద్రబాబు. రాజకీయ కోసం వెంకటేశ్వర స్వామీ వాడుకున్నారు. చంద్రబాబు చేసినా ప్రతి ఆరోపణ కు విచారణ సిద్దంగా ఉన్నాం అని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.