ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. పోలవరంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక ప్రకటన చేశారు. అమ్మ పేరుతో చెట్టు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కార్యాలయంలో చెట్టు నాటిన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. అనంతరం మాట్లాడారు.
పోలవరం నిర్మాణానికి కేంద్ర సహకారం ఉంటుంది.. పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్నారు. దేశ పర్యావరణాన్ని కాపాడేందుకు అమ్మపేరుతో చెట్టు నాటాలని ప్రధాని మోడీ పిలుపిచ్చారు… అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటామో నాటిన చెట్టును అంతేలా చూసుకోవాలన్నారు.
దేశంలో పచ్చదనాన్ని పెపొందించడానికి ఉపయోగ పడే కార్యక్రమం అని తెలిపారు. అమ్మపేరుతో ప్రతిఒక్కరు చెట్లు నాటాలని వెల్లడించారు. చంద్రబాబు సాయంత్రం ఎంపీలతో సమావేశం అవుతారు… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి ఎటువంటి సహకారం కావాలో ఆలోచన చేసి ముందుకి వెళతామని చెప్పారు. ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చేది అంశం కాదు… ప్రత్యేక హోదా లేదనేది బీహార్ కి కూడా వర్తిస్తుందన్నారు. ప్యాకేజి నిధుల ద్వారా రాష్ట్ర అభివృద్ధి సహకారానికి కేంద్రం సిద్ధంగా ఉంది… గత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల పోలవరం సమస్యల్లో ఉందని తెలిపారు.