ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

-

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపడిన ఘటనలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిపోకి చెందిన ఒక పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ఈరోజు మధ్యాహ్నం రావులపాలెం మీదుగా నరసాపురం వెళుతుండగా రావులపాడు కాలువ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి రోడ్డుపై ఉన్న గోతులలో పడి ఒక్కసారిగా వెనుక వైపు చక్రాలు విరిగిపడటంతో అదుపు తప్పింది.

అయితే డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కగా ఆపడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. బస్సు వెనుక భాగంలో కట్ ప్లేట్లు విరిగిపోవడంతో వెనుక భాగం చక్రాలు ఊడిపడి 10 అడుగుల దూరంలో పడ్డాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 15 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, రోడ్లపై గోతుల కారణంగానే బస్సు ప్రమాదానికి గురైనట్లు డ్రైవర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news