ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మేరుగ నాగార్జున కు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై నమోదైన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసు కొట్టేస్తే అభ్యంతరం లేదని హై కోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేశారు బాధితురాలు. అయితే.. ఈ తరుణంలోనే…న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
తప్పుడు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారు కూడా పరిణామాలు ఎదుర్కోవాలని పేర్కొన్నారు న్యాయమూర్తి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి మేరుగ నాగార్జున కేసులో కూడా ఇదే విషయం వర్తిస్తుందన్నారట. ఫిర్యాదు చేయటం తర్వాత కోర్టుకు వచ్చి కేసు కొట్టేయాలని ఇటీవల తరచూ చూస్తున్నామని వ్యాఖ్యానించింది కోర్టు. కేసు డైరీ, పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణ ఈ నెల 12కి వాయిదా వేసింది.