శాఖల కేటాయింపుల్లో జనసేనకు బిగ్‌ షాక్‌ ?

-

శాఖల కేటాయింపుల్లో జనసేనకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. అయితే.. ఇందులో పవన్ కళ్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అంతేకాదు… పవన్ కళ్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా పదవులు కూడా దక్కాయి. అయితే.. ఇక్కడ జనసేన పార్టీ వారికి కీలక పదవులు దక్కలేదు.

 

నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ మాత్రమే ఇచ్చారు. కందుల దుర్గేష్ కు పర్యావరణం, సాంస్కృతిక శాఖ ఇచ్చి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు. కానీ చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు ఉన్నాయి. హోం శాఖ మంత్రి గా వంగలపూడి అనితకు, ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ కు ఇచ్చారు. ఇలా కీలక శాఖలన్నీయూ… టీడీపీ శాఖ తీసుకుంది.దీంతో జనసేన పార్టీలో నిరాశ నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news