ఏపీలో డయేరియా కలకలం.. ఓ మహిళా మృతి..!

-

ఏపీలోని కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం రేపుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు డయేరియా బారిన పడుతున్నారు. ఇప్పటికే సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పటికే చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. గ్రామ సచివాలయంలో పలువురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితులను డీఎంహెచ్ ఓ పరీశీలించారు. వాటర్ ట్యాంక్ లో నీటిని టెస్టింగ్ కోసం పంపించారు.

అదేవిధంగా నిల్వ ఉన్న రొయ్యల కూర, మామిడి తాండ్ర తినడం వలన కొందరు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్థులు చెప్తున్నారు. ఈ ఘటనపై తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. కొమ్మనాపల్లి గ్రామంలో 34 మంది అస్వస్థతకు గురయ్యారు అని తెలిపింది. అందులో పది మంది కోలుకున్నారు.. ఫుట్ పాయిజన్, వాటర్ పొల్యూషన్ అస్వస్థతకి కారణంగా తెలుస్తుంది.. అయితే, అధికారులు ఇప్పటికే శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకి పంపించారని చెప్పుకొచ్చింది.. ఇబ్బంది ఉన్నవారిని కాకినాడ జీజీహెచ్ కి తరలించే ఏర్పాటు చేస్తున్నారు అని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news