పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు పరాభవం..చెప్పులతో దాడి !

-

పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కు పరాభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే ను అడ్డుకున్న గ్రామస్థులు.. రోడ్డుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. సోమందేపల్లి మండలం ఈదల బలాపురం పంచాయతీ రేణుకానగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ వాహనంపైకి చెప్పులు విసిరిన గ్రామస్థులు… తమ గ్రామంలోకి రావద్దు అంటూ ఎమ్మెల్యే శంకర్నారాయణను అడ్డుకున్నారు. దీంతో సోమందేపల్లి మండలం రేణుక నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల సహాయంతో గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన శంకర్ నారాయణ…గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన కుండానే వెనుతిరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news