కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్ పై సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో.. సమాచారం లీక్ అవుతున్న నేపథ్యంలో.. చాలా వరకు మొబైల్ అప్లికేషన్స్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మొబైల్ యాప్స్‌కు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అదేంటంటే..?
14 మెసెంజర్ యాప్స్‌ను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఉగ్రవాదులు.. వారి మధ్య సమాచారం చేరవేసుకునేందుకు ఈ యాప్స్ దోహదపడుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ ప్రకారం ఆ యాప్స్‌ను కేంద్రం బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన యాప్స్ జాబితాలో.. క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌స్విస్, విక్రమ్, మీడియాఫైర్, బ్రియర్, బీఛాట్, నాన్డ్‌బాక్స్, కొనియన్, ఇమో, ఎలిమెంట్, సెకండ్‌లైన్,జంగి, త్రీమా ఉన్నాయి. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన మొబైల్ అప్లికేషన్లపై కేంద్రం కొన్నేళ్లుగా చర్యలు తీసుకొంటున్న విషయం తెలిసిందే.