పశ్చిమగోదావరి: ఎన్డీఏ మిత్రపక్షాల ఆత్మీయ సమావేశానికి పవన్ కళ్యాణ్ ని బిజెపి పిలిపించుకోవడంపై రాజకీయ విశ్లేషణ అంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పవన్ చరిష్మాను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని బిజెపి చూస్తోందన్నారు. బిజెపి – జనసేన కలిసి పోటీ చేస్తే గత ఎన్నికల కంటే రెండు శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.
ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి గాని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమేనని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి బిజెపి ప్రయత్నం చేయకపోవడానికి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలే కారణం కావచ్చన్నారు. నీతివంతమైన పరిపాలన చేస్తున్న మోడీ చరిష్మా బిజెపి – జనసేన కూటమికి ఉపయోగపడవచ్చన్నారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చక పోవడం వల్ల బిజెపికి సానుకూల పరిస్థితి లేదన్నారు.
బిజెపికి మత రాజకీయాల వల్ల కూడా నష్టం కలగజేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి బిజెపితో జనసేన పొత్తు ఎంతవరకు లబ్ధి చేస్తుందనేది కాలమే చెప్పాలన్నారు. జనసేనతో బిజెపి పొత్తు జనసేనకంటే బీజేపీకే లాభం ఎక్కువ జరిగే అవకాశం ఉందన్నారు. టిడిపి గత అధికారంలో చేసిన అభివృద్ధి చంద్రబాబు పరిపాలన దక్షిత జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేనకు కలిసొచ్చే అవకాశం ఉందన్నారు.