నో డౌట్: ఆ రెడ్డి ఎమ్మెల్యేలు కళ్లుమూసుకుని గెలిచేస్తారు!

-

ఏపీలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే ఎక్కువ. గుంటూరు నుంచి చూసుకుంటే కర్నూలు వరకు రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఈ ఐదు జిల్లాలు కలిపి 62 సీట్లు ఉంటే సుమారు 40 మంది వరకు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 10 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇక వీరే వైసీపీకి వెన్నుముక అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఒకటి, రెండు సీట్లలో మినహా..నిలబడిన ప్రతి రెడ్డి నాయకుడు గెలిచాడు. అంటే రెడ్డి నేతల సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక వీరే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. మిగతా వర్గాలతో పాటు రెడ్డి వర్గం మళ్ళీ జగన్‌ని సి‌ఎం చేయాలని చూస్తున్నాయి. ఇందులో రెడ్డి వర్గం కీలకం.

అయితే గత ఎన్నికల్లో జగన్ గాలిలో చాలామంది గెలిచారు. మరి ఈ సారి ఆ గాలి ఉంటుందా? పైగా టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి ఇబ్బంది ఈ పరిణామాలని చూసుకుని..ఒకసారి చూసుకుంటే తిరుగులేకుండా గెలిచే రెడ్డి ఎమ్మెల్యేల్లో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాగార్జున రెడ్డి, మహీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, వై.సాయిప్రసాద్ రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, శిల్పా రవి, రవీంద్రానాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి..వీరంతా మళ్ళీ డౌట్ లేకుండా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక కొందరు టఫ్ ఫైట్ ఎదురుకున్న రెడ్డి ఎమ్మెల్యేల్లో కొందరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news