ఏపీలో పాలన ఎలా సాగుతుందనేది, కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా.. జగన్ ఎలా పాలిస్తున్నది ఏపీలో ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి! మరోపక్క స్వయంగా మోడీతో కలిపి జాతీయ మీడియా సైతం.. కరోనా సమయంలో జగన్ పాలన భేష్ అని కితాబిస్తున్న పరిస్థితి! అయినా కూడా తనకు కనిపించడం లేదో లేక వినిపించడం లేదో తెలియదు కానీ… జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి!
అవును… ఒక పక్క తమ పార్టీ పెద్ద, దేశ ప్రధాని మోడీ ఏమో జగన్ పాలనపై ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే… మరో పక్క ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం.. ఏపీలో ప్రజలు కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొస్తున్నారు! కేంద్రం నుంచి వచ్చే నిధులు అభివృద్ధికి వినియోగించడం లేదని చెప్పుకొస్తున్నారు! రాష్ట్రంలో కరోనా పరిస్థితులకు, వర్షాలతో వచ్చిన ఇబ్బందులకూ వైసీపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు!
అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడ విష్ణు గ్రహించాల్సినవి చాలా విషయాలే ఉన్నాయి. వాటిలో ఒకటి… ఏపీలో కరోనా విషయంలో జగన్ చాలా చాకచక్యంగా వ్యవహరించారని బీజేపీ పాలిత ప్రాంతాల్లోని ముఖ్యమంత్రులు సైతం ప్రశంసితున్నా సంగతి! పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రులకు, స్వరాష్ట్ర ప్రజలకు అర్ధం అయ్యింది కానీ.. ఏనాడూ ప్రజాక్షేత్రంలో గెలవని విష్ణు కు మాత్రం అర్ధం కావడం లేదు!
ఇదే సమయంలో… ఏపీ పరువు జగన్ గంగలో కలిపేస్తున్నారంట! అదే నిజమైతే… ఏపీ బీజేపీ పెద్దలు జగన్ వైపు ఎందూ చూస్తున్నారు.. జగన్ మద్దతులు ఎందుకు కోరుతున్నారు.. కేబినెట్ లోకి ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు!! ఇక్కడ విష్ణు గ్రహించాల్సిందేమిటంటే… జగన్ పాలనపై కేంద్రంలోని పెద్దలకు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకు అర్ధం అయినట్లు ఏపీలో, రాయలసీమలో ఉన్న విష్ణు వర్ధన్ రెడ్డి కి కూడా అర్ధమవ్వాలని కోరుకుంటున్నారు ఏపీ బీజేపీ కార్యకర్తలు!!