గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రా ప్రభావం ఉంటుందా…?

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు తెరాస పార్టీ విజయ వ్యూహాలను సిద్దం చేస్తుంది. వ్యతిరేకంగా ఉన్న పరిణామాలను ఇప్పుడు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను ఆ పార్టీ చేస్తుంది. అవి ఫలిస్తాయా లేదా అనేది చెప్పలేము గాని, ఇప్పుడు తెరాస పార్టీని మాత్రం క్షేత్ర స్థాయి ఇబ్బందులు కొన్ని బాగా వెంటాడే అవకాశం ఉందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మురికివాడలు, బస్తీలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు వస్తే ఈ బస్తీ ప్రాంతాల్లో పరిణామాలు ఊహకు కూడా అందవు.

ఎప్పుడు వర్షం పడినా సరే సామాన్యులు బయటకు వచ్చే అవకాశం అనేది లేదు. కాబట్టి ప్రచారంలో ఇప్పటి వరకు ఏ విధమైన హామీలు ఇచ్చినా సరే… ఇప్పుడు హామీలు అమలు కాలేదు అనేది అర్ధమవుతుంది. చర్యలు కనపడితేనే ఇప్పుడు ప్రజలు కూడా ఈవీఎం మీద స్విచ్ నొక్కే విషయంలో ఆలోచిస్తున్నారు. కాని మెజారిటీ హైదరాబాదీలు ఇప్పుడు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి విషయంలో ఇప్పుడు తెరాస ప్రభుత్వం జాగ్రత్తగానే ఉంది గాని… కొన్ని కొన్ని మాత్రం తెరాసను ఇబ్బంది పెట్టవచ్చు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆ పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి ఓటు వేయడం లేదు గాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వారు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్ లో ఐటి మీద ఆధారపడే చాలా మంది ఇప్పుడు… తెరాస ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా ఎన్నికల్లో అంటే చెప్పలేము అనేది విశ్లేషకుల మాట. ఎందుకు అంటే… తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఇబ్బంది పడటానికి తెరాస కారణం అనేది చాలా మంది వలస వచ్చిన వారిలో ఉన్న అభిప్రాయం.

కాబట్టి అక్కడి నుంచి తెలంగాణకు వచ్చిన వారు తెరాసకు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా కీలకం అయ్యే అవకాశం ఉంది. వైసీపీ ఇప్పుడు మా మీద దాడి చేస్తుంది అనే భావన కమ్మ సామాజిక వర్గం మీద ఉంది. కాబట్టి తెరాసతో వైసీపీ స్నేహం చేస్తుంది కాబట్టి… ఈ విధంగా కూడా కొంత ఓటు బ్యాంకు దూరం కావొచ్చు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీకి ఓట్లు పడే అవకాశం కూడా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news