రాబోయే ఐదేళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెను సవాళ్లు ఎదురు కానున్నాయి అని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే 14 ఏళ్ళు సీఎంగా చేసిన అనుభవం చంద్రబాబుకి కలిసి వచ్చే అంశం. నేను మాజీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సూచనలు ఇస్తాను. అమరావతి, పోలవరంకు కేంద్రం సహకరిస్తుంది. కాబట్టి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి అని అన్నారు.
ఒడిస్సా, ఛత్తీస్గఢ్ తో పోలవరంకు ఉన్న అంతరాష్ట్ర సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎన్నికల ముందు సినిమాల్లో హిట్స్ లేక పవన్ కళ్యాణ్ స్ట్రగ్లింగ్ స్టార్ గా ఉండేవారు. కానీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యారుఅని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 92,000 కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయి. ఇప్పడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా అంతగా ఏం బాలేదు అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.