కొడాలి నానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సవాల్

-

చార్జీషీట్ ల పేరుతో ఏపీలో బిజెపి దూకుడు పెంచింది. ఇటీవల గుడివాడలో బిజెపి చార్జీ షీట్ సందర్భంగా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై ఏపీ బిజెపి ఇన్చార్జ్ సునీల్ దియోథర్ చేసిన వ్యాఖ్యలతో గుడివాడలో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కొడాలి నాని కి బహిరంగ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం గుడివాడలోనైనా పూర్తి అయ్యాయో చెప్పగలరా..? అని ప్రశ్నించారు.

రేపు గుడివాడ బస్టాండ్ దగ్గరికి వస్తే బహిరంగ చర్చ పెడదామని కొడాలి నానికి సవాల్ విసిరారు విష్ణువర్ధన్ రెడ్డి. ప్రజా చార్జీ షీట్ లో ఉన్న అంశాలపై చర్చకు తాము సిద్ధమని అన్నారు. ఇక గతంలో ప్రధాని మోదీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీలు ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బిజెపి ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news