ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం : సుజనా చౌదరి

-

ఆరోగ్య శ్రీ వర్తించట్లేదని ఒక నిరు పేద కుటుంబం వచ్చారు వారికీ వెంటనే వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసాము అని బీజేపీ ఎమ్మెల్యే వై సుజనా చౌదరి తెలిపారు. నందిగామ లో ఉద్యోగాలు ఇస్తామని తిరుపతి వాసుల నుంచి 48 లక్షలు తీసుకున్నారని ఒక సమస్య వచ్చింది వెంటనే సీఐ కి వివరాలు తెలియచేసి కేసు ని పరిష్కరించాలని కోరాము. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు . విజయవాడ బుడమేరు వరద బాధితులకి అనేక విధాలుగా ప్రభుత్వం నుంచి, ప్రయివేట్ సంస్థలు ఇలా స్వచ్చందంగా వచ్చి సేవలు అందిస్తున్నారు, ఆర్ ఎస్ ఎస్, ఎబివిపి, బిజేవైఎం, కిసాన్ మోర్చా, మైనారిటీ మోర్చా కార్యకర్తలు సేవా కార్యక్రమాలు లో ఉన్నారు.

అలాగే ప్రకాశం బ్యారేజ్ గేట్ల ని బోట్ల ఢీకొన్న ఘటన పై ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. జాతీయ విపత్తు గా నిర్ణంచాలంటే కొన్ని నియమ నిబంధందనలు ఉంటాయి వాటికి అనుగుణంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. అయితే వరదల్లాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం అని ఎమ్మెల్యే వై సుజనా చౌదరి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version