కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ కట్!

-

ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుందన్న విషయం మనకి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో నేటికీ అదే అమల్లో ఉంది. దానిని సవరించేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు జరిగాయి. కానీ తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ కట్ చేసే బిల్లుకు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫిరాయింపులను అరికట్టేందుకు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ కొత్త రూల్ వర్తించనుంది. ఈ బిల్లును బుధవారం అసెంబ్లీ ఆమోదించింది.

దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలినట్లు అయ్యింది. రాజ్యసభ ఎన్నికల సమయంలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటును కోల్పోవడంతో ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి ఈ బిల్లుని ప్రవేశపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version