ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి సోషల్ మీడియా, ద్వారా మరింతగా తీసుకువెళ్లాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రజలు అద్భుతమైన విజయాన్ని మనకు ఇచ్చారు. మొన్న ప్రజలు ఇచ్చిన ఫలితం జయ అపజయాలతో కూడుకున్న అంశం కాదు. గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి , ఉపాధి అవకాశాలు అన్నదానికి ఆనవాళ్లు లేకుండా పోవడం జరిగింది. ఎవరన్నా గళం విప్పితే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగింది.
వాక్ స్వతంత్రం లేదు, మహిళలపై అఘాయిత్యాలు, నాణ్యత లేని మద్యం సరఫరా లాంటివి ఇబ్బందులు పడ్డారు. ఒకపక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధిని కావాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారు. గడిచిన వందరోజులు ఆర్థిక శాఖ ఏ విధంగా బలోపేతం చేయాలో చంద్రబాబు 100 రోజులు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం కూడా రాష్ట్రానికి సహకరించడానికి అన్ని విధాలా ముందుకు వస్తుంది అని పురందేశ్వరి తెలిపారు.