కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుంది : జీవీఎల్

-

కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుందని జీవీఎల్ ప్రకటన చేశారు. 2019 ఎన్నికల్లో 26 జిల్లాల ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించామని.. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగిందని ఆయన చెప్పారు. వసతులు,సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని.. నిధులు లేకుండా కొత్త జిల్లాల్లో విధులు నిర్వహించడం సాధ్యం అవుతుందా..? అని ప్రశ్నించారు.

విభజన జరిగిన తరువాత రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకటన అలాగే ఉందని.. అమరావతి లాగా కొత్త జిల్లాలను చెయ్యొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. ఒక్కో జిల్లాకు కనీసం రూ. 100 కోట్ల నిధులను ఎందుకు కేటాయింపులు చెయ్యలేదు…? అని నిలదీశారు. ప్రభుత్వం కొత్త జిల్లాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జిల్లాల పరిస్థితి నిర్వీర్యం అవుతుందని.. కొత్త జిల్లా ఏర్పాటులో జిల్లా కేంద్రం, మండల కేంద్రాలకు అస్సలు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మౌళిక వసతులు ఏర్పాట్లు చేయకుండా కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తారు..? అని.. జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు కనెక్టివిటీ పెంచాలని పేర్కొన్నారు. అమరావతిపై హై కోర్టు ఆదేశాలు ధిక్కరించేలా ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని.. అమరావతికి నిధులు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని తెలిపారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహాకరించడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news