కరోనా రావడం ఇదే ఫస్ట్ టైం బోండా!

-

కొంతమంది నేతలు, మరి ముఖ్యంగా ఏపీ టీడీపీ నేతలు ఏమి మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి. నేడు మే డే కారణంగా ఉన్నఫలంగా వారికి కార్మికలోకం గుర్తుకురావడంతో… ఉదయం నుంచి అటు ట్విట్టర్లలోనూ, ఇటు మైకుల ముందూ నానా హడావిడీ చేసేస్తున్నారు టీడీపీ నేతలు. అందులో భాగంగా… ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు ఇంతకుముందు ఏరోజు లేవు… 40రోజులుగా పనులులేక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు… ఇలాంటి మేడే మునుపెన్నడూ రాలేదు… పనులు లేక కార్మిక కుటుంబాలు విలవిల్లాడిపోతున్నాయి… ఇదంతా కేవలం జగన్ కు పరిపాలనా అవగాహన, పరిపాలనా అనుభవం లేకపోవడం వల్ల వచ్చినవే అని అంటున్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు!

అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితికి, జగన్ పాలనానుభవానికి, పరిపాలనా అవగాహనకు ఏమైనా సంబందం ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు ఏరోజు లేవని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు చెప్పుకొస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన… వైసీపీ ప్రభుత్వం అసమర్థ విధానాలవల్ల, సీఎం జగన్‌కు పరిపాలనపై అవగాహన లేకపోవడం వల్ల రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన 60 లక్షల మంది కార్మికులు పస్తులతో ఉంటున్నారని.. లాక్ డౌన్ నేపథ్యంలో 40 రోజులుగా పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మేడే రోజున కార్మికులు పస్తులతో పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు… లాక్ డౌన్ పరిస్థితికి, కరోనా ఈ రేంజ్ లో ప్రభలడానికి గల కారణాలతో జగన్ కు ఏమైనా సంబందం ఉందా? ప్రపంచానికి కరోనా వైరస్ రావడం ఇదే మొదటిసారి! ఇలాంటి విపత్తును ఎదుర్కోవడం ప్రపంచానికే కాదు… మన దేశానికి కూడా ఇదే ఫస్ట్ టైం! అసలు ఇది మానవమాత్రుడు ఊహించింది కాదు… వచ్చాక ఏమి చేయాలిరా దేవుడా అనుకునేలోపే అంతా వ్యాపించేస్తుంది… ఇలాంటి పరిస్థితుల్లో మీనమేషాలు లెక్కేస్తే కుదరదని ఒక్కరోజు జనతా కర్ఫ్యూని కాస్తా ఉన్నఫలంగా లాక్ డౌన్ గా మర్చేశారు ప్రధాని మోడీ.

ఈ పరిస్థితుల్లో ఎవరైనా, ఏ ముఖ్యమంత్రైనా ఏమి చేయగలరు… ప్రధాని మాత్రం ఏమి చేస్తున్నారు! జగన్ అనే కాదు… ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ దేశ ప్రధాని అయినా… ఆ దేశం అభివృద్ధి చెందింది అయినా… వెనకబడినది అయినా… ఈ సమయంలో ఉన్నంతలో ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రానివ్వకుండా, ఎవరూ పస్తులుండకుండా చూడటమే గొప్ప విషయం! జనాలు ఆశించేది కూడా అంతే! ఈ విషయంలో జగన్ సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. ఈ విషయాలు మరిచిన కొంతమంది మాత్రం… ఇదేదో ఊహించిన ఉపద్రవం అన్నట్లు…. నేటి పరిస్థితికి జగన్ పరిపాలనా అవగాహన లోపం, అనుభవ లోపం అంటూ కబుర్లు చెబుతున్నారు. 40ఏళ్ల క్రితం చంద్రబాబు కి ఏమి అనుభవం ఉంది? మొదటిసారి మంత్రి అయినప్పుడు బోండాకు ఏమి అనుభవం ఉంది? ఇంట్లో అద్దాలు ఉంటాయిగా ఉమా!?

Read more RELATED
Recommended to you

Latest news