ఏపీ కంటే, తెలంగాణ ఉద్యోగులే సంతోషంగా ఉన్నారు – బొప్పరాజు

-

ఏపీ కంటే, తెలంగాణ ఉద్యోగులే సంతోషంగా ఉన్నారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్ బొప్పరాజు. తెలంగాణాలో ఒక్క డీఏ పెండింగులో లేదు…ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త డీఏ ఊసే లేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. సీఎస్ జవహర్ రెడ్డిని కలిసింది ఏపీ జేఏసీ అమరావతి బృందం.

ఉద్యోగుల సమస్యలతో కూడిన 50 పేజీల నివేదికను సీఎస్ కు అందచేశారు ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్ బొప్పరాజు. అనంతరం బొప్పరాజు మాట్లాడుతూ, గత 47 రోజులుగా ఏపీ జెఎసి అమరావతి ఉద్యమాన్ని చేపడుతోందన్నారు. ఇవాళ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పైన 29న గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ధర్నాలు చేపడతామని.. ఈ నెల 28న అన్ని ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని హెచ్చరించారు.

ఉద్యోగుల సమస్యలపై గతంలో సమావేశాలు పెట్టినా పరిష్కారానికి నోచుకోవడం లేదు…ఈ నెల 28 నుంచి కార్మిక, టీచర్స్, సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామన్నారు. మేం చాలా ఓపికతో సహనంతో ఉద్యమాన్ని చేస్తున్నాం…డీఏ అరియర్స్ చెల్లించడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలీదని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news