రూ. 1800 కోట్ల బకాయిలు ఇంకా ఇవ్వాలని.. జగన్ సర్కార్ పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ జెఏసి అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..చట్ట బద్దంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించ లేదని.. రూ. 1800 కోట్ల బకాయిలు ఇంకా ఇవ్వాలని జగన్ సర్కార్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
అవి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదన్నారు. పీఆర్సీ అరియర్ లు కూడా ఎంత ఇవ్వాలో లెక్కలు చూస్తామని అధికారులు చెప్పారని వెల్లడించారు. పోలీసులు, వైద్య శాఖ లో పని చేస్తున్న వారికి ఇచ్చే స్పెషల్ పే లకు కాల పరిమితి వద్దని చెప్పామని పేర్కొన్నారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లు లో 16 శాతం హెచ్ అర్ ఏ ఉత్తర్వులు ఇవ్వలని కోరామని.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకూ మా ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదన్నారు. ఇవాళ జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశం యదావిధిగా కొనసాగుతుందని.. మా ఉద్యమ ఫలితం గానే 5860 కోట్ల బకాయిలు డబ్బులు ఇచ్చారన్నారు ఏపీ జెఏసి అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు.