సీఎం సభావేదికకు నిప్పు.. ఆ రాష్ట్రంలో హై అలర్ట్

-

మ‌ణిపూర్‌ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఆ రాష్ట్రంలోని చురాచంద్ర‌పూర్ జిల్లాలో ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని బంద్ చేసింది. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు గుమికూడ‌రాదు అని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా..?

మణిపూర్ రాష్ట్ర సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఇవాళ చురాచంద్రపూర్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. అక్కడ ఓ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే గురువారం రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.. సీఎం బీరేన్ పాల్గొనే స‌భావేదిక‌కు నిప్పుపెట్టారు. దీంతో ఆ వేదిక పూర్తిగా మంట‌ల్లో ద‌గ్ధ‌మైంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అక్కడి పోలీసులు.. ఈ ఘటనకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు.

రిజ‌ర్డ్వ్ ఫారెస్టులో బీజేపీ స‌ర్కార్ చేస్తున్న స‌ర్వేల‌పై స్థానికుల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఈ నేపథ్యంలోనే గిరిజ‌న సంఘాలు భారీ ఆందోళ‌న చేప‌ట్టాయి. మరోవైపు ఎటువంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండానే చ‌ర్చిల‌ను కూల్చివేస్తున్నార‌ని, ప‌విత్ర‌మైన చ‌ర్చిల ప‌ట్ల అగౌర‌వంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గిరిజ‌న నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news