మీరు ఏదైనా టూర్ వేసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ప్యాకేజీని తప్పక చూడాల్సిందే. ఎన్నో టూర్ ప్యాకేజీలని IRCTC తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీలతో ఎంచక్కా అన్ని ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. కేంద్ర పాలిత ప్రాంతం అయిన లడఖ్ అందాలు ఈ టూర్ ప్యాకేజీ తో చూసి రావచ్చు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ అందుబాటులో వుంది. వేసవిలో ఈ ప్యాకేజీ ద్వారా లేహ్ అందాలు చూసి వచ్చేయచ్చు. షామ్ వ్యాలీ, లేహ్, నుబ్రా, టుర్టుక్, పాంగాంగ్ మొదలైనవి ఈ ప్యాకేజీ ద్వారా కవర్ అవుతాయి. 2023 మే 4న టూర్ ఈ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. 6 రాత్రులు, 7 రోజుల ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీ ని బుక్ చేసుకున్న పర్యాటకుల్ని ఫ్లైట్ లో తీసుకెళ్లి లడఖ్ ని చూపిస్తారు.
మొదటి రోజు హైదరాబాద్‌లో ఈ టూర్ మొదలు అవుతుంది. తెల్లవారుజామున 5.10 గంటలకు హైదరాబాద్‌లో స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12.30 గంటలకు లేహ్ చేరుకుంటారు. తర్వాత మార్కెట్ చూడచ్చు. రాత్రికి లేహ్‌లో బస చేసి.. రెండో రోజు సైట్‌సీయింగ్ ఉంటుంది. భారతీయ ఆర్మీ నిర్మించిన మ్యూజియం హాల్ ఆఫ్ ఫేమ్, జోరావార్ ఫోర్ట్, గురుద్వార పత్తర్ సాహీబ్, శాంతి స్తూప, లేహ్ ప్యాలెస్ ఇవన్నీ చూడచ్చు. రాత్రికి లేహ్‌లో బస చేయాలి. మూడో రోజు నుబ్రా వ్యాలీ ఉంటుంది. లంచ్ తర్వాత దిక్షిత్, హండర్ విలేజ్ చూడొచ్చు. క్యామెల్ సఫారీ ని కూడా ఎంజాయ్ చేసేయచ్చు. నుబ్రా వ్యాలీలో రాత్రి స్టే చెయ్యాలి. నాలుగో రోజు టుర్టుక్ విలేజ్ సందర్శించవచ్చు.
1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో భారతదేశం గెలుచుకున్న గ్రామం ఇది. సియాచిన్ వార్ మెమొరియల్, థంగ్ జీరోపాయింట్, టుర్టుక్ గ్రామం వీటిని కూడా చూడచ్చు. అలానే బాల్టీ హెరిటేజ్ హౌజ్, మ్యూజియం, నేచురల్ కోల్డ్ స్టోరేజ్ చూడాచ్చు. ఐదో రోజు పాంగాంగ్ లేక్ చూడచ్చు. ఆ తర్వాత త్రీ ఇడియట్స్ సినిమా షూట్ చేసిన లొకేషన్ చూడొచ్చు. రాత్రికి పాంగాంగ్‌లో ఉండాలి. ఆరో రోజు పాంగాంగ్ లేక్‌లో సూర్యోదయాన్ని చూడొచ్చు. థిక్సీ మొనాస్ట్రీ, షే ప్యాలెస్, రాంచో స్కూల్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత లేహ్ బయల్దేరాలి. రాత్రికి లేహ్‌లో ఉండి… ఏడో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ధర విషయానికి వస్తే… ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.47,830, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.48,560, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.54,500 చెల్లించాలి.