ఏపీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..త్వరలో కొత్త పీఆర్సీ

-

ఏపీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. మంత్రి బొత్స సత్యనారాయణ 2023 జూలై నుంచి అమలయ్యేలా కొత్త వేతన సవరణ కమిషన్ నియమించాలని ఉద్యోగ సంఘాలు నిన్నటి సమావేశంలో కోరగా… ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి బొత్స భరోసా ఇచ్చారు.

దీనిపై సీఎం జగన్ తో చర్చించి వేతన సవరణ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు 70% బకాయిలు చెల్లించామన్న బొత్స సెప్టెంబర్ లోగా మిగతా 30% బకాయిలు చెల్లిస్తామన్నారు. అలాగే, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, పెండింగ్ నిధులు వంటి అంశాల పై చర్చించాని వివరించారు. అన్ని అంశాలకు టైం బాండ్ పెట్టామని.. మే ఒకటి నుంచి వరుసగా జీవోలు జారీ అవుతాయని వెల్లడించారు. పీఆర్సీ కమిటీని ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ఓపీఎస్ పై అడిగారు…తర్వాతి సమావేశంలో చర్చిద్దాం అని చెప్పాన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చర్చకు వచ్చిందని.. ముఖ్యమంత్రి కూడా ఈ అంశం పై సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news