మోడీ పేరు చెప్పి.. బాబు పుండుమీద కారం చల్లుతున్న బొత్స!

-

అవకాశం దొరికిందనో లేక బాబు పాపం పండిందనో తెలియదు కానీ… అమరావతి రైతులను మోసం చేసిన పేరు చెప్పిన బాబును ఆడేసుకుంటుంది అధికార పార్టీ! మోడీ రెండు వేల ఎకారాలు చాలంటే బాబు తలూపారని.. కానీ అధికారంలోకి వచ్చాక ముప్పైమూడు వేల ఎకరాలు సేకరించారని.. దానివెనకున్న ఆలోచనలు తనకు తెలియదన్నట్లుగా పవన్ స్పందించిన అనంతరం వైకాపా నేతలు మరింత బలం చేకూరింది. దీంతో బొత్సా సత్యన్నారాయణ లాజిక్కులు లాగారు!

నేడు అమరావతి రైతులు పడుతున్న ఇబ్బందులకు కారణం బాబు అని ఇప్పటికే పరోక్షంగా బీజేపీ, ప్రత్యక్షంగా వారి మిత్రపక్షం జనసేన చెబుతున్న తరుణంలో… ఏపీలో మెజారిటీ ప్రజలు అదే నిజమని నమ్ముతున్న సమయంలో ఆ విషయాన్ని క్యాష్ చేసుకునే పనికి, అందులోని వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే పనికి వైకాపా పూనుకుంది.

అమరావతి నుంచి పూర్తి రాజధానిని విశాఖ, కర్నూలు కు విభజిస్తోన్న నేపథ్యంలో స్పందించిన బాబు & కో… ఆ పాపం మొత్తం బీజేపీదే అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మోడీ మట్టీ నీళ్లు ఇచ్చిన అమరవాతికి విలువలేకుండా చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో మైకందుకున్న బొత్సా… విశాఖలో రాజధాని శంకుస్థాపనకు మోడీని పిలుస్తామని ప్రకటించారు! దీంతో తమ్ముళ్ల గొంతులో వెలక్కాయపడినంత పనైంది!

ప్రధాన మంత్రి హోదాలో మోడీ ప్రమేయంతో, హస్తవాసితో ప్రారంభమైన అమరావతిని నేడు కేంద్రమోలోని బీజేపీ అడ్డుకుంటుందని చెబుతున్న తమ్ముళ్లకు సమాధానం దొరికినట్లయ్యింది. మోడీ మట్టీ నీళ్లు ఇచ్చిన అమరావతి అలానే ఉంది… జగన్ అభివృద్ధి ఆలోచనల్లో భాగంగా మొదలవ్వబోతోన్న విశాఖ రాజధాని పనుల శంకుస్థాపనకు కూడా మోడీ వస్తారని బొత్సా చెప్పడంతో… మోడీని విమర్శించే క్రమంలో తమ్ముళ్లకు ఇబ్బందులు తలెత్తనున్నాయి!

సీఎం ఎవరైనప్పటికీ వారి వారి ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానిస్తే ప్రధానమంత్రి హోదాలో మోడీ వస్తారని బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. దీంతో… ప్రధాని వచ్చారు, ప్రధాని వేసిన పునాధి రాయి సమాధిరాయిగా మారుందన్న విమర్శకు చెంపపెట్టులా ఇది మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి! ఇదే జరిగితే… అది కచ్చితంగా బాబు పుండుమీద కారం చల్లినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news