AP: ప్రియురాలు ఇంట్లో ఉరి వేసుకుని ప్రియుడి ఆత్మహత్య

-

కృష్ణా జిల్లా ఉయ్యూరు లో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలు ఇంట్లో ఉరి వేసుకుని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో శనివారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన చందా మాధవ రాజు(30) కోరపాటు మాధవి (28) ప్రేమించుకుంటున్నారు.

Boyfriend committed suicide by hanging himself at his girlfriend’s house

అయితే.. ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి 2021 లో విడిపోయారట. ఇక గత రాత్రి మాధవి వాళ్ళ ఇంటికి వెళ్లి మృతుడు తనకు మాధవికి పెళ్లి చేయమని అడిగాడట. అయితే…వాళ్లిద్దరి పెళ్లికి పెద్దలు నిరాకరించడం జరిగింది. ఇక చేసేది ఏమీ లేక… అర్ధరాత్రి సమయంలో మాధవి వాళ్ళ ఇంటి వరండాలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news