మూడున్నరేళ్ల చిన్నారి రేప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై తిరుపతి ఎస్పి సుబ్బారాయుడు కీలక ప్రకటన చేశారు. వడమాలపేట పేట ఘటనలో మూడున్నర సంవత్సరాల చిన్నారి చంపింది మావయ్యనేనని తెలిపారు తిరుపతి ఎస్పి సుబ్బారాయుడు.
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్ లెట్ లు కోని ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశాడని తెలిపారు. చిన్నారి హత్యపై అన్ని ఆధారాలు సేకరించాము… ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు ఎస్పి సుబ్బారాయుడు. నిందితుడు పేరు నాగరాజు అలియాస్ సుశాంత్ అని తెలిపారు. ఇక అటు కన్న కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు..కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు తల్లి దండ్రులు. సుశాంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా యానాది కాలనీకి చెందిన మధు కుమార్తె సాన్వికపై అత్యాచారం చేసి చంపేశాడు సుశాంత్.