బ్రేకింగ్: కరోనా ఉన్నా ఆగని వాహన మిత్ర, వరుసగా రెండో ఏడాది జమ

-

ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క కరోనా వైరస్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగులకు జీతాలను కూడా ఇచ్చే పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అయినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా విస్మరించడం లేదు. ప్రతీ ఒక్క హామీని ఆయన నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే జగన్ వెనక్కు తగ్గడం లేదు.

తాజాగా నాలుగు నెలల ముందుగానే వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. రెండో విడత ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. లబ్ది దారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 వెలను జమ చేసింది. దీనిపై ఇప్పుడు పలువురు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టాలు ఉండి చిన్న చిన్న కుటుంబాలే ఇబ్బంది పడుతున్నాయి అని అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం…

ఈ స్థాయిలో ఇబ్బంది పడుతూ కూడా సాయం చేయడమ నిజంగా సంతోషంగా ఉంది అని అంటున్నారు. దీనిపై సిఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ అందరికి మంచి జరగాలి అనేది తమ ఉద్దేశమని చెప్పారు. భవిష్యత్తులో అందరికి కూడా ఫలాలు అందే విధంగా చూస్తామని ఆయన స్పష్టం చేసారు. ఆర్ధిక ఇబ్బందులతో పేద వాడు బాధ పడకూడదు అని సిఎం అన్నారు. రాని వారు స్పంధన యాప్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news