మీ వయసు 30 దాటిందా..? లైఫ్ స్టయిల్ లో ఈ మార్పులు చేసుకోవాల్సిందే

-

 

30 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న తర్వాత జీవితంలో కొత్త దశ ప్రారంభం అవుతుంది. ఆరోగ్యపరంగా ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 20ల్లో ఉన్నప్పటిలా నిర్లక్ష్యంగా ఉంటే ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది.

ముఖ్యంగా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలాగే ఎముకలు బలంగా ఉండేలా ఆహారాలను తీసుకోవాలి. ప్రస్తుతం 30 దాటిన తర్వాత మగవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టయిల్ మార్పులు చేసుకోవాలా తెలుసుకుందాం.

హెల్త్ చెకప్:

క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవడం వల్ల శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే ముందుగానే జాగ్రత్త తీసుకున్నట్టు అవుతుంది. ముఖ్యంగా కొవ్వు స్థాయిలు, బిపి ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది.

ఎముకల ఆరోగ్యం మీద దృష్టి:

ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎవ్వరిలోనైనా ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దీనివల్ల ఎముకలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో క్యాల్షియం తగ్గిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి క్యాల్షియం ఇంకా విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం అవుతాయేమో చెక్ చేసుకోవాలి.

గుండె ఆరోగ్యం మీద దృష్టి:

ఈ మధ్యకాలం లో యువకుల్లో హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. గుండె ఆరోగ్యాన్ని పెంచే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాలయిన చేప మొదలగు వాటిని డైట్ లో తీసుకోవాలి.

మానసిక ఆరోగ్యం:

శారీరకంగా ఎంత ఫిట్ గా ఉన్నప్పటికీ మానసికంగా బాగోలేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద ఆటోమేటిక్ గా పడిపోతుంది. అనవసరమైన ఒత్తిడిని దూరం చేసుకోండి. మీకు ఒత్తిడి కలిగించే విషయాలకు దూరంగా ఉండండి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news