రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

-

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీపై పంపింది. ఈ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రిజ్వీకే కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. మరోవైపు రవాణా, గృహనిర్మాణం, సాధారణ పరిపాలనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ను రవాణా, రోడ్లు, భవనాల శాఖలో అదే హోదాలో నియమించగా.. రవాణా, రోడ్లు, భవనాల శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌.హరీశ్‌ను విపత్తుల నిర్వహణశాఖలో అదే హోదాలో బదిలీ చేశారు. పాత పోస్టును కూడా అదనపు బాధ్యతల కింద అప్పగించారు.

వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి పి.ఉదయ్‌కుమార్‌కు మార్కెటింగ్‌శాఖ సంచాలకునిగా అదనపు బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం.. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌ చెక్కా ప్రియాంకను పురపాలకశాఖలో ఉపకార్యదర్శిగా ట్రాన్స్ఫర్ చేసింది. సహకార శాఖ సంయుక్త రిజిస్ట్రార్‌ కె.చంద్రశేఖర రెడ్డిని హాకా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మార్చిన సర్కార్.. వాణిజ్య పన్నులశాఖ సంయుక్త కమిషనర్‌గా వరంగల్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్‌ రెడ్డిని మార్క్‌ఫెడ్‌ ఎండీగా బదిలీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news