బుడమేరుకు పడిన రెండో గండి పూడ్చివేత పనులు పూర్తి..!

-

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల బుడమేరుకు గండ్లు పడిన విషయం తెలిసిందే. దీంతో పక్కనే ఉన్న లంక గ్రామాలకు భారీగా వరద వచ్చింది. దాంతో బుడమేరు వాగు గండ్లు పూడ్చివేతకు ఆర్మీ రంగంలోకి డిఫైనా విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి 40 మంది ఇంజనీరింగ్ బృందాలతో ఆర్మీ వచ్చింది.ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం కు చేరుకున్న ఆర్మీ.. ఇవాళ గండి పూడ్చివేతకు పనులు చేపట్టనుంది.

అయితే ఆర్మీ రాకకు ముందే బుడమేరుకు పడిన రెండో గండి పూడ్చివేత పనులు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం.గత ఐదు రోజుల్లో రెండు గండ్లు పూడ్చి వేత వేసిన ప్రభుత్వం.. మూడో గండి నీ పూడ్చ టానికి ఆరుమై సహాయంతో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరుపుతుంది. అర్థరాత్రి 3.30 గంటల సమయంలో రెండో గండి పూడ్చి వేత పనులు ముగిసాయి. ఇక మూడో గండి పూడిస్తే బెజవాడ నగరానికి బుడమేరు నుంచి ముప్పు ఉండదని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version