అంకుశం సినిమాలో రాంరెడ్డిలా స్పీకర్ తమ్మినేనిని ఈడ్చుకెళ్తాం – బుద్దా

-

అంకుశం సినిమాలో రాంరెడ్డిలా స్పీకర్ తమ్మినేనిని ఈడ్చుకెళ్తామని టీడీపీ నేత బుద్దా వెంకన్న వార్నింగ్‌ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో వైసీపీ కుక్కలకే మేం సమాధానం చెపుతాం….పందిలా బలిసిన తమ్మినేని సీతారాం ని వదిలేస్తామా అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూనా రవికుమార్ చేతిలో ఓడిపోతావ్.. మేం అధికారంలోకి వచ్చాక అంకుశం సినిమాలో సీతారామ్‌ ను రౌడీలా కూన రవికుమార్… రాజశేఖర్ పాత్రలా నడిపిస్తామని హెచ్చరించారు.

టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన వాళ్లే ఆక్రోశంతో చంద్రబాబుపై వాడుతున్నారని… అవినాష్ రెడ్డి విషయంలో న్యాయ వ్యవస్థల్ని జగన్ ని మేనేజ్ చేశారా…? అని నిలదీశారు. సునీతా రెడ్డి వెళ్లకపోయినా నేను సుప్రీంకోర్టు కు వెళ్తానని.. వైస్ వివేకానంద రెడ్డి మర్డర్ ని అడ్డుపెట్టుకుని 2019 ఎన్నికల్లో టీడీపీ పై బురద చల్లారని ఆగ్రహించారు. టీడీపీ పై అభియోగం మోపి జగన్ అధికారo లోకి వచ్చాడని.. జగన్ ముందస్తుకు వెళ్లినా టీడీపీ సూపర్ మెజారిటీ గెలవడం ఖాయం అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులతో సహా 175 స్థానంలో గెలుస్తామని.. పాదయాత్ర తో లోకేష్ ఇమేజ్ వంద రేట్లు పెరిగిందని వెల్లడించారు. నేను చంద్రబాబు కు విధేయుడిని… నేను విజయవాడ వెస్ట్ లొనే పోటీ చేస్తా లేకపోతే మా నాయకుడు ఎక్కడ చెపితే అక్కడ పోటీ చేస్తానని ప్రకటించారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news