జగన్ కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు : మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

-

గతంలో చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారంటే.. దానికి ఒక కారణం ఉంది. ఆరోజు మీరు నిండు సభలో ఆయన్ను , ఆయన కుటుంబాన్ని అవమానించారు కాబట్టి బయటకు వచ్చారు అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అయితే ఆ సమయంలో మిగతా సభ్యులంతా అసెంబ్లీకి వెళ్లి.. ప్రజల తరపున గళం విప్పారు. వారివారి నియోజకవర్గాలలో ప్రజా సమస్యలపై ప్రస్తావించారు. ఇప్పుడు జగన్ తల్లిని, భార్యను ఎవరైనా ఏమన్నారా.. మీలాగా బూతులు తిట్టారా. జగన్ కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. దానికి మీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి రానివ్వడం లేదు.

18 సీట్లు ఇస్తే.. ప్రతిపక్ష హోదా వచ్చేది.. ఇదే విషయాన్ని గతంలో జగనే చెప్పాడు కదా.. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి.. ప్రజల తరపున మాట్లాడాలి. వెళ్లేది లేదంటే.. ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు కూడా వెనక్కి ఇచ్చి, రాజీనామాలు చేయాలి. అసలు అసెంబ్లీకి వెళ్లని మిమ్మలను ఎమ్మెల్యేలుగా ఎలా పరిగణించాలి. ప్రజల తరపున నిలబడని మీకు అసలు ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత కూడా లేదు. చంద్రబాబుకు జరిగిన అవమానంతోనే ఆనాడు అసెంబ్లీ కి రానని శపదం చేశారు. మళ్లీ సీఎంగా మాత్రమే అడుగు పెడతానని చెప్పి వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు కూడా పట్టం కట్టారు. నేడు అసెంబ్లీలో సీఎంగా ఆయన పని తీరును ప్రజలే హర్షిస్తున్నారు. మంగమ్మ శపధం అంటూ ఆనాడు నోరు పారేసుకున్న కొడాలి నాని ఇప్పుడు ఎక్కడ. చంద్రబాబుది చాణక్య శపధం కాబట్టే.. ప్రజలు కూడా అండగా నిలబడ్డారు అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news