జెనరేటర్ లో చక్కర.. మనోజ్ ఇంటి పవర్ పీకేసిన విష్ణు..!

-

గత రెండు రోజులుగా మంచు ఫ్యామిలీ సైలెంట్ కావడంతో వివాదం సద్దు మణిగింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ మంచు ఇంకా రగులుతూనే ఉంది. అయితే ఈసారి ఈ మంచు వివాదం కోట దారులు తొక్కుతుంది అనే చెప్పాలి. తాజాగా జల్ పల్లి లో మరోసారి గొడవ జరిగింది.మంచు మనోజ్ ఇంటికే కి చెందిన జెనరేటర్ లో పంచదార పోసి తమ్ముడి ఇంటికి కరెంట్ వెళ్లకుండా చేసారు మంచు విష్ణు.

దీంతో మరోసారి మంచు వివాదం తెరపైకి వచ్చింది. అయితే కాసేపట్లో మరోసారి పహాడి షరీఫ్ పీఎస్ కి మంచు మనోజ్ రానున్నారు. తన ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయేలా విష్ణు చేసిన అన్ని ఆధారాలతో అన్న పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్నారు మనోజ్. అయితే మూడు రోజుల ముందు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో అన్న పేరు కానీ తండ్రి పేరును కానీ చేర్చలేదు. కానీ ఈసారి విష్ణుపై ఫిర్యాదు చేయడానికి సిద్ధం అయిపోయాడు మనోజ్.

Read more RELATED
Recommended to you

Latest news