సూపర్ సిక్స్ కాదు… చంద్రబాబు డక్ ఔట్ అయ్యారు – బుగ్గన

-

సూపర్ సిక్స్ కాదు… చంద్రబాబు డక్ ఔట్ అయ్యారు అంటూ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ చురకలు అంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ స్పందించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి పైన చంద్రబాబు నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారంటూ ఫైర్ అయ్యారు. ఆర్థికంగా ఉన్న లోపాలు ఇవి.. మేము వీటిని సరిదిద్దుతాం అని ఉండేలా వైట్ పేపర్ ఉండాలని కోరారు.

buggana on ap budget 2024

ఇది శ్వేత పత్రమా.. లేదా సాకు పత్రమా.! అంటూ ఫైర్ అయ్యారు. సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారు.. మొట్ట మొదటి ఓవర్ లోనే డక్ అవుట్ అయ్యారన్నారు. రెండు లక్షల నలభై వేల కోట్లు మీకు ఆదాయం ఉందని తెలిపారు. అపారమైన తెలివి మీకు ఉందనే కదా మిమ్మల్ని ఎన్నుకుందన్నారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌. ఎప్పుడు అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ప్రజలు కాచుకుని ఉన్నారు..హామీలు అమలు చేయకుండా సూపర్ సిక్స్ ను డక్ అవుట్ చేశారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news