సీఎం రేవంత్ రెడ్డి నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తనపై హత్యాయత్నం చేపించాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు ఏమో.. ఇద్దరూ బీఆర్ఎస్ నేతల మధ్య పంచాయితీనీ కాంగ్రెస్ ని లాగొద్దు అన్నారు.
నిన్న సీఎం రేవంత్ రెడ్డి మావాళ్ల జోలికి వస్తే.. వీపు చింతపండు అయితది బిడ్డ. మా వాళ్లు ఎవ్వరి జోలికి పోరు అని నవ్వుకునేవిధంగా మాట్లాడారు అని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. మహబూబ్ నగర్ లో నీ వీపు చింతపండు అయింది రేవంత్ రెడ్డి అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. కౌశిక్ రెడ్డి జోలికి వచ్చిన వారిని ఎవ్వరినీ కూడా వదిలిపెట్టడు రేవంత్ రెడ్డి.. అలాగే తన ఇంటి మీద దాడి చేయించిన పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి.