తిరుమల ఘాటు రోడ్డులో బస్సు బోల్తా.. టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన

-

తిరుమల మొదటి ఘాట్ రోడ్డు లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అలిపిరెడ్డి పోగు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు 28వ మలుపు వద్దకు బోల్తా పడింది. అయితే బస్సులో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నారు. ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక వారిని తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు.

ఇక తిరుమల…ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలాని పరిశీలించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. బస్సు ప్రమాదం జరగడానికి కారణాలు పై అధ్యయనం చేయిస్తూన్నామని..ఎలక్ట్రిక్‌ బస్సులో టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రాధమికంగా నిర్దారణ కు వచ్చారని వివరించారు.
డ్రైవర్ అతి వేగంగా బస్సును నడపడం కారణంగానే ప్రమాదం అన్నారు. ఘట్ రోడ్డులో పూర్తి స్థాయిలో క్రాష్ బ్యారియర్లు, కాంక్రీట్ రిటైనింగా వాల్స్ నిర్మిస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news