Case registered over Essentia Pharma accident: అనకాపల్లి జిల్లాలోని ఎసెన్షియా ఫార్మాలో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు అయింది. BNS 106(1), 125(b),125(a) సెక్షన్ కింద ఎసెన్షియా ఫార్మాపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఎసెన్షియా ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యం పై కేసు అయింది. నిర్లక్ష్యంతొ మరణానికి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రాంబిల్లి పోలీసులు.
అయితే.. ఈ అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఇక అటు 35 మంది బాధితులు..చికిత్స పొందుతున్నారు. విశాఖ, అనకాపల్లి ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఇక అటు అచ్యుతాపురం ప్రమాదస్థలికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో అచ్యుతా పురం ప్రమాదస్థలికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు.