ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి పరీక్ష ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈనెల మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం మార్కులను ఆన్లైన్ లో ఎంటర్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 22వ తేదీన పదోతరగతి పరీక్షలు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 6.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా ఇటీవల ఇంటర్ పరీక్ష ఫలితాలను.. ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పదోతరగతి పరీక్షలపై కీలక అప్డేట్ వచ్చింది.